Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogజర్నలిస్టులకు ఏమిస్తారు.. మల్లికార్జున్

జర్నలిస్టులకు ఏమిస్తారు.. మల్లికార్జున్

నేటి సత్యం కొల్లాపూర్ మే 31

అందరికీ ఎన్నెన్నో ఇచ్చారు..!
జర్నలిస్టులకి ఏమిస్తారు..?
(యస్.పి. మల్లికార్జున సాగర్).
తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు కొనసాగిన ఉద్యమం లో పాల్గొన్న కవు లకు కళాకారులకు ఉద్యమ నేతలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి పాలకులు ఆర్థికం గా సామాజికం గా ఎదిగేందుకు ఎన్నెన్నో పదవులను పథకాలను ఇచ్చారు..!
తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు సాగిన ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టులకు గత ప్రభుత్వము గాని ప్రస్తుత ప్రభుత్వం కానీ ఎలాంటి పదవులు అవార్డులు రివార్డులను గుర్తింపు లన ఇవ్వలేదని..? వచ్చే రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడైనా జర్నలిస్టులకు ఏమైనా ఇస్తారా..? అని జర్నలిస్టులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టి డబ్ల్యూ జె ఎఫ్) జాతీయ కౌన్సిల్ సభ్యులు యస్.పి. మల్లికార్జున సాగర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు గతం లో సాగిన ఉద్యమం లో పాల్గొన్న కవులకు కళాకారులకు అలాగే రాజకీయ నాయకులకు ఉద్యమకారులకు పదవులు ఇచ్చారు.. పారితోషికాలు ఇచ్చారు , కానీ ప్రజాస్వామ్య పరిరక్షణలో నాలుగవ స్తంభం గా నిలిచిన జర్నలిస్టులు కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు గతం లో జరిగిన అనేక ఉద్యమాలలో తమ వంతుగా పాల్గొన్నారు అలాంటి జర్నలిస్టులకు గత ప్రభుత్వము గాని ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో పదవిలో ఉంటున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలకులు ఎలాంటి పదవులను కానీ అవార్డులను రివార్డులను గుర్తింపు లను ఇవ్వడం లేదని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసి అమరుడైన శ్రీకాంతాచారి తల్లికి కూడా ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పరం గా సముచిత స్థానము ను కల్పిస్తూ హోదాను కూడా ఇవ్వడం జరిగిందని ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తించి తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు కృషి చేసిన జర్నలిస్టులకు కూడా వచ్చే జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడైనా తగిన గుర్తింపును అవార్డును రివార్డులను హోదాలను కల్పించి తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు కృషిచేసిన జర్నలిస్టు లను ఆదుకోవాలని వారిని సన్మానించుకోవాలని వారికి సముచిత స్థానాలు కల్పించాలని ఆర్థికం గా వృత్తి పరం గా ఆదుకోవాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ( టిడబ్ల్యూజేఎఫ్) జాతీయ కౌన్సిల్ సభ్యులు యస్.పి. మల్లికార్జున సాగర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments