Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogకాక్రోజ్ విప్లవం..

కాక్రోజ్ విప్లవం..

నేటి సత్యం హైదరాబాద్ జూన్ 7

‘కాక్రోచ్’ విప్లవం

 జంతర్ మంతర్ వద్ద యువత మహాధర్నా!

నిప్పు కనకమైంది… నిశ్శబ్దం గర్జనైంది! దేశంలో కోట్లాదిమంది నిరుద్యోగ యువత గుండెల్లో ఏళ్ల తరబడి గూడుకట్టుకున్న నిరాశ, నిస్సహాయత ఇప్పుడు ఒక్కసారిగా బద్దలై లావాగా మారుతోంది. పరీక్షల కుంభకోణాలు, పేపర్ లీకేజీలు, పెరుగుతున్న నిరుద్యోగంతో భవిష్యత్తు అంధకారంగా మారిన వేళ—”ఇక చాలు… మా భవిష్యత్తుతో ఆటలాడకండి!” అంటూ భారత యువత వీధుల్లోకి వస్తోంది. ఈ తరం ఆగ్రహానికి ప్రతీకగా, వ్యవస్థలో జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో కోట్ల మందిని కదిలించిన ‘కాక్రోచ్’ జనతా పార్టీ’ (CJP) ఇప్పుడు రోడ్లపై ప్రత్యక్ష సమరానికి సై అంటోంది.

​ఈ మహా నిరసనను ముందుండి నడిపించేందుకు అమెరికా నుంచి బయలుదేరిన పార్టీ వ్యవస్థాపకుడు, బోస్టన్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అభిజీత్ దిప్కే ప్రయాణిస్తున్న విమానం మరో కొద్ది గంటల్లో ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ కాబోతుండటంతో రాజధానిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎయిర్‌పోర్టులోనే తన్ను అరెస్ట్ చేస్తారేమోనని కుటుంబ సభ్యులు భయపడుతున్నా, దేశ భవిష్యత్తు కోసం జైలుకైనా సిద్ధమంటూ అభిజీత్ విసిరిన సవాల్ యువతలో కొత్త జోష్ నింపింది. విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా మద్దతుదారులతో కలిసి చారిత్రాత్మక జంతర్ మంతర్ వేదికగా దేశ విద్యాశాఖ మంత్రి రాజీనామాను డిమాండ్ చేస్తూ శాంతియుత ధర్నాకు దిగబోతున్నారు.

​ఈ ఉద్యమానికి దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగానూ మద్దతు లభిస్తోంది. *ప్రముఖ విద్యావేత్త, ఆవిష్కర్త సోనమ్ వాంగ్‌చుక్ స్వయంగా ఈ నిరసనలో పాల్గొనబోతుండటం,*

*ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సౌరవ్ దాస్,*

*ఫిలిం మేకర్ విజేత దహియా,*

*సంతోష్ రాంకా వంటి ప్రతినిధులు గళమెత్తడంతో ఈ పోరాటం మరింత పదునెక్కింది.* ఇటీవల 20 లక్షల మందికి పైగా విద్యార్థుల భవితవ్యాన్ని బుగ్గిపాలు చేసిన మెడికల్ ప్రవేశ పరీక్ష పేపర్ లీకేజీలు, దాదాపు 40 శాతం గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులుగా మిగిలిపోతున్న దారుణ పరిస్థితులే ఈ యువ విప్లవానికి కారణమయ్యాయి. గతంలో బంగ్లాదేశ్, నేపాల్‌లలో యువత తిరుగుబాటు చేసి ప్రభుత్వాలనే కూల్చివేసిన చరిత్రను గుర్తుచేస్తూ, నేడు జంతర్ మంతర్ సాక్షిగా జరగబోయే ఈ ‘కాక్రోచ్’ పోరాటం భారత రాజకీయాల్లో ఎలాంటి మలుపు తిప్పబోతుందోనని దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments