Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogఅంతర్జాతీయ పండ్ల మార్కెట్ శంకుస్థాపన.

అంతర్జాతీయ పండ్ల మార్కెట్ శంకుస్థాపన.

నేటి సత్యం కోహెడ జూన్ 7

కోహెడ లో దేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ రాయి సమీకృత పండ్ల మార్కెట్ ను శంకుస్థాపన చేసిన, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు*

నేటి సత్యం ప్రతినిధి సక్రు నాయక్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రంగారెడ్డి జిల్లా కోహెడలో దేశంలోనే అతిపెద్ద, అంతర్జాతీయ స్థాయి సమీకృత పండ్ల మార్కెట్‌కు (ఇంటర్నేషనల్ ఇంటిగ్రాటెడ్ ఫ్రూట్ మార్కెట్ ) శంకుస్థాపన చేశారు. పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో రూ. 3,387 కోట్ల భారీ వ్యయంతో 239 ఎకరాలలో ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.కోహెడ మెగా మార్కెట్ ప్రత్యేకతలు:లక్ష్యం: ‘తెలంగాణ రైజింగ్ విజన్-2047’ లక్ష్యంగా పండ్ల రైతులకు, ఎగుమతిదారులకు ప్రపంచ స్థాయి వేదికగా ఇది రూపుదిద్దుకుంటోంది.సదుపాయాలు: అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఈ మార్కెట్‌లో పండ్లు, పూలు, డ్రై ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, శీతల నిల్వలు (కోల్డ్ స్టోరేజ్), మాంసం, చేపల విక్రయాలకు ప్రత్యేక విభాగాలు ఉంటాయి.ప్రయోజనం: ఈ మార్కెట్ అందుబాటులోకి వస్తే దాదాపు 1.65 లక్షల మంది రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.సమయం: రాబోయే మూడేళ్లలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కానుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments