నేటి సత్యం శేరిలింగంపల్లి జూన్ 8
పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి
*ఈ నెల 10వ తేదీ “చలో కలెక్టరేట్” కార్యక్రమాన్ని జయప్రదం చేయండి** పానుగంటి పర్వతాలు సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాల కారణంగా పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు అమాంతం పెరిగి సామాన్య ప్రజల జీవితాలను దుర్భరంగా మార్చాయి. మరోవైపు బియ్యం, పప్పులు, కూరగాయలు, వంటనూనెలు తదితర నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ప్రజలపై భారాలు మోపడం దారుణమని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) తీవ్రంగా ఖండిస్తోంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్‌పై విధిస్తున్న అధిక పన్నులను వెంటనే తగ్గించి ధరలను నియంత్రించాలని, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను అరికట్టాలని సిపిఐ డిమాండ్ చేస్తోంది.
ఈ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్న “చలో కలెక్టరేట్” కార్యక్రమాన్ని ప్రజలు, కార్మికులు, యువత, మహిళలు శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు పిలుపునిచ్చారు.
ప్రజల జీవన వ్యయాన్ని పెంచుతున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టి రామకృష్ణ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు. కే చందు యాదవ్ శేర్లింగంపల్లి నియోజకవర్గం కార్యదర్శి. కే వెంకటస్వామి సిపిఐ జిల్లా సమితి సభ్యులు