నేటి సత్యం శేరిలింగంపల్లి జూన్ 8
అక్రమ అరెస్టులను ఖండించండిగాదగోని రవి
యంసిపిఐ (యు) రాష్ట్ర కార్యదర్శి
రాష్ట్ర ముఖ్యమంత్రి మియాపూర్ పర్యటన ఉంది అనే నెపంతో
యంసిపిఐ ( యు) గ్రేటర్ హైదరాబాద్ జిల్లా
కార్యదర్శి వర్గ సభ్యులు.
మియాపూర్ డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ఇస్లావత్ దశరత్ నాయక్ ను అరెస్టు చేసి మియాపూర్ పోలీసు స్టేషన్ లో ఉంచి ప్రస్తుతం పటాన్ చెరువు పోలీసు స్టేషన్ కు తరలించినట్లు సమాచారం ఇది అప్రజాస్వామిక నియంతృత్వ చర్య.
ప్రజా ప్రభుత్వం అని ఊదర కొట్టుకొనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల్లోకి వస్తు ఉన్నపుడు ప్రజా సమస్యలపై ప్రజా నాయకులను అడిగి తెలుసుకోవాలి కానీ అక్రమ ముందస్తు అరెస్టు లతో పోలీసు బలగాలను మోహరించి సభలు జరుపటం ఏమి ప్రజా ప్రభుత్వం ఇది ఈ చర్యను,ఈ అప్రజాస్వామిక నియంతృత్వ విధానం గత ప్రభుత్వం అవలంబిస్తే ప్రజలు గుణపాఠం చెప్పారు.
ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నకు కూడా గుణపాఠం తప్పదు.
ఇంకా ముందస్తు అరెస్టు విధానం మార్చుకొని.
అరెస్టు చేసిన వామపక్ష నాయకులను యం సి పి ఐ (యు )కామ్రేడ్ దశరత్ నాయక్, సి పి యం, కె క్రిష్ణ లను విడుదల చేయాలని యంసిపిఐ (యు) తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.