Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogసీఎం బహిరంగ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.

సీఎం బహిరంగ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.

నేటి సత్యం శేర్లింగంపల్లి జూన్ 8

మియాపూర్ లో జరిగిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి భారీ బహిరంగ సభ ను పెద్ద ఎత్తున విజయవంతం చేసిన శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు, తాజా మాజీ కార్పొరేటర్లకు, నాయకులకు, కార్యకర్తలకు, మహిళ సోదరీమణులకు, పాత్రికేయ మిత్రులకు, అధికారులకు , అనాధికారులకు, అభిమానులకు శ్రేయభిలాషులు ప్రతి ఒక్కరికి పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసిన గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు*

మియాపూర్ చౌరస్తా లో జరిగిన సైబరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(CMC) ప్రధాన కార్యాలయం మియాపూర్ చౌరస్తా ఫ్లై ఓవర్ మరియు పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు,గౌరవ మంత్రి వర్యులు శ్రీ శ్రీధర్ బాబు గారు, గౌరవ రాజ్య సభ సభ్యులు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు, శ్రీ అనిల్ యాదవ్ గారు, గౌరవ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్యేలు శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి గారు, శ్రీ నవీన్ యాదవ్ గారు, గౌరవ చైర్మన్ లు శ్రీ జేరిపేటి జైపాల్ గారు, శ్రీ బండి రమేష్ గారు , శ్రీ రఘునాథ్ యాదవ్ గారు, గౌరవ తాజా మాజీ కార్పొరేటర్లు, గౌరవ CMC కమిషనర్ శ్రీమతి సృజన గారు, గౌరవ జోనల్ కమిషనర్లు శ్రీ నారాయణ్ అమిత్ మాలెంపాటి గారు, శ్రీ మయాంక్ సింగ్ గారు, గౌరవ పోలీస్ కమిషనర్ శ్రీ రమేష్ రెడ్డి గారు , గౌరవ డీసీలు శ్రీ బాలకృష్ణ గారు, శ్రీ సేవా ఇస్లావత్ గారు,శ్రీమతి చాముండేశ్వరి గారు ఇతర అధికారుల తో కలిసి పాల్గొన్న గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ గారు మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సుమారుగా రూ. 2000 కోట్ల రూపాయల తో మియాపూర్ చౌరస్తా ఫ్లై ఓవర్ మరియు సైబరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(CMC) ప్రధాన కార్యాలయం మరియు ఇతర అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. నా తరుపున శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజల తరుపున ప్రత్యేక ధన్యవాదములు తెలియచేస్తున్నాను .

*మొత్తం 1674.78 కోట్ల రూపాయల శంకుస్థాపన లో భాగంగా*

 *మా నియోజకవర్గంలో 1213.40 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది.*

* 819.50 కోట్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి*

*మొత్తం 2032.90 కోట్ల అభివృద్ధి పనులు*

1. మియాపూర్ చౌరస్తా నుండి ఆల్విన్ కాలనీ చౌరస్తా వరకు రూ.530.00 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించబోయే 6 లేన్ బై డైరెక్షనల్ ఫ్లై ఓవర్ 1790 మీటర్ల పొడవు,24 మీటర్ల వెడల్పు హఫీజ్ పెట్ నుండి మియాపూర్ వరకు 3 లెన్ Uni డైరెక్షనల్ అండర్ పాస్ మరియు బాచుపల్లి నుండి ఆల్విన్ చౌరస్తా వరకు 3 లెన్ Uni డైరెక్షనల్ అండర్ పాస్ ఫ్లై ఓవర్

2.రూ. 308 కోట్ల రూపాయలతో లింగంపల్లి ROB ఫ్లై ఓవర్

3. రూ. 200 కోట్ల రూపాయలతో, మియాపూర్ లో 10 ఎకరాలలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల

4. రూ. 161 కోట్ల రూపాయలతో, ఖానమేట్ లో సైబరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(CMC) ప్రధాన కార్యాలయం

5.రూ. 14 కోట్ల 40 లక్షల రూపాయల తో మాదాపూర్ మరియు నానక్ రాం గూడ లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మాణం పనులు

* శంకుస్థాపన జరిగి, అండర్ ప్రోగ్రెస్ లో ఉన్న అభివృద్ధి పనులు

1. రూ. 459 కోట్ల రూపాయల తో గచ్చిబౌలి ఐఐటీ జంక్షన్ ఫ్లై ఓవర్ నిర్మాణము పనులు జరుగుతున్నవి.

2. రూ. 220 కోట్ల రూపాయలతో కాజాగుడా జంక్షన్ ఫ్లై ఓవర్ నిర్మాణం పనులు జరుగుతున్నవి.

3. రూ. 100 కోట్ల రూపాయల తో కొండాపూర్ మరియు చందా నగర్ లో కోర్ అర్బన్ పాఠశాలలకు శంకుస్థాపన చేసుకోవడం జరిగినది .

4. కొండాపూర్ జిల్లా ఆసుపత్రి లో రూ. 40 కోట్ల 50 లక్షల రూపాయల 100 పడకల క్రిటికల్ కేర్ విభాగం భవనం నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. అని PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments