Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogమండల ప్రజా పరిషత్ కార్యాలయం తనిఖీ

మండల ప్రజా పరిషత్ కార్యాలయం తనిఖీ

నేటి సత్యం గన్నేరువరం జూన్ 29

గన్నేరువరం మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ జిన్నా తేజస్విని

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ కుమారి జిన్నా తేజస్విని సోమవారం పర్యటించారు. శిక్షణలో భాగంగా ఆమె మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని సందర్శించి, ఎంపీడీవో విధుల నిర్వహణ మరియు కార్యాలయ పనితీరును అడిగి తెలుసుకున్నారు.అనంతరం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు స్థానిక హెల్త్ సబ్ సెంటర్‌ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థుల విద్యా ప్రమాణాలను, హెల్త్ సబ్ సెంటర్‌లో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, ఎంపీఓ సురేందర్, పిఆర్ ఏఈ సురేందర్, హౌసింగ్ ఏఈ మహేందర్, ఎంఈఓ రామయ్య, పంచాయతీ కార్యదర్శి వెంకట్ రెడ్డి మరియు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments