Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogదళిత యువకుడి పై దాడి..?

దళిత యువకుడి పై దాడి..?

గుండ్లపల్లిలో దళిత యువకుడిపై దాడి ముగ్గురుపై కేసు నమోదు

గన్నేరువరం, జూలై 14, (నేటి సత్యం):మండల పరిధిలోని గుండ్లపల్లి ఎక్స్ రోడ్డు సమీపంలో ఓ దళిత యువకుడిపై దాడి చేసి, కులం పేరుతో దూషించిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు గన్నేరువరం సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) తెలిపారు.ఘటన వివరాల్లోకి వెళితే ఈ నెల 13న (సోమవారం) మధ్యాహ్నం సుమారు 2:00 గంటల సమయంలో గుండ్లపల్లి ఎక్స్ రోడ్డు వద్ద గల బేతల్లి రాజేందర్ రెడ్డి సిమెంట్ బ్రిక్స్ వద్ద ఫిర్యాదుదారుడైన శ్రవణ్ తండ్రి పర్షురామ్, కులం -మాదిగ) తన స్నేహితుడు పైడిపాల మల్లేష్‌తో కలిసి ఉన్నాడు. ఆ సమయంలో గుండ్లపల్లి గ్రామానికి చెందిన బేతల్లి రాజేందర్ రెడ్డి, పంబాల సంపత్, కొమ్మర ప్రశాంత్ రెడ్డి అనే ముగ్గురు వ్యక్తులు అక్కడికి వచ్చి, వారితో అనవసరంగా గొడవకు దిగారు. బాధితులను తీవ్రంగా దుర్భాషలాడుతూ, శ్రవణ్‌ను కులం పేరుతో అవమానించి, భౌతికంగా దాడికి పాల్పడ్డారు.బాధితుడు శ్రవణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం జూలై 14న నిందితులు రాజేందర్ రెడ్డి, సంపత్, ప్రశాంత్ రెడ్డిలపై గన్నేరువరం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments