నేటి సత్యం నిజాంబాద్ అంకాపూర్ జూలై 20
అంకాపూర్‌లో హైటేషన్ బిజెపి కాంగ్రెస్ నేతల గృహ నిర్బంధం
నిజామాబాద్ జిల్లా ఆర్మూరు లో టెన్షన్ వాతావరణం నెలకొంది బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఛలో అంకాపూర్ పైడి రాకేష్ రెడ్డి ఇల్లుముట్టడికి కాంగ్రెస్ నేత వినయ్ రెడ్డి పిలుపు నిచ్చారు. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎన్నికల సమయంలో ఒక్క రూపాయికివైద్యం, ఒక్కొక్క గ్రామానికి స్వచ్ఛందంగా పేదలకు పది ఇండ్లు నిర్మిస్తానని, ఒక సమత్సరంలో ఆర్మూరు కు పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి మర్చారని దీంతో ఎమ్మెల్యేకు గుర్తుచేయడo కోసం అంకాపూర్లోని ఆయన ఇంటిని ముట్టడిస్తామని తెలపడంతో దానికి కౌంటర్ గా రాకేష్ రెడ్డి వీడియో రిలీజ్ చేశారు. నా ఇల్లు ముట్టడించే స్థాయి మిది కాదని ఆయన మీడియాతో అన్నారు. నా ఇల్లు ముట్టడించాలంటే ముఖ్యమంత్రి, మంత్రులు ముట్టడించాలని అన్నారు. దీంతో పోలీస్ కమిషనర్ రెండు రోజులపాటు 144 సెక్షన్ విధించారు. దీంతో ఆర్మూరు లో ఉద్రిక్తవతవరణం నెలకొంది ముందస్తుగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉదయం నుండే రాకేష్ రెడ్డి ని గృహ నిర్బంధం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు వినయ్ కుమార్ రెడ్డి ఇంటి వద్ద కూడా పోలీస్ బలగాల తో బందోబస్తు ఏర్పాటుచేశారు.
కాంగ్రెస్,బీజేపీ పార్టీల నేతలు సోమవారం పోటాపోటీ కార్యక్రమాలతో అంకాపూర్ గ్రామం హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
కాంగ్రెస్ నేత వినయ్ రెడ్డి తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలపై పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు ఆయనను ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు
అంకాపూర్లోని బీజేపీ ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమవుతుండగా, వచ్చిన వారికి సమాధానం చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామని బీజేపీ నాయకులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి కూడా అంకాపూర్లోని తన నివాసంలోనే ఉంటానని స్పష్టం చేశారు. ఆయనను కూడా పోలీసులు గృహ నిర్బంధంలోనే ఉంచారు ఇక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఉన్నతాధికారులు గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు