Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogజులై 24న విద్యాసంస్థల బంద్

జులై 24న విద్యాసంస్థల బంద్

నేటి సత్యం శేర్లింగంపల్లి జిల్లా 22

జూలై 24న విద్యాసంస్థల బందును జయప్రదం చేయండి

నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి టి నితీష్ ధర్మ తేజ ఏఐఎస్ఎఫ్ శేరిలింగంపల్లి

నీట్ పరీక్షల్లో జరిగిన పేపర్ లీకేజీ దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన ఘోర సంఘటన. విద్యా వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీసిన ఈ ఘటనకు పూర్తి రాజకీయ, నైతిక బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమైంది.

నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. విద్యార్థుల భవిష్యత్తును నిర్లక్ష్యం చేసిన కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఏఐఎస్ఎఫ్ తీవ్రంగా ఖండిస్తోంది.

ఈ నేపథ్యంలో జూలై 24న నిర్వహించే రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బందును శేరిలింగంపల్లి నియోజకవర్గం లో విద్యార్థులు, యువజనులు, అధ్యాపకులు, ప్రజాస్వామ్యవాదులు విజయవంతం చేయాలని ఏఐఎస్ఎఫ్ పిలుపునిస్తోంది. విద్య హక్కును పరిరక్షించడానికి, పరీక్షా వ్యవస్థలో పారదర్శకతను కాపాడడానికి ప్రతి విద్యార్థి ఈ బందులో భాగస్వామి కావాలి.

విద్యను కాపాడుదాం – విద్యార్థుల భవిష్యత్తును రక్షిద్దాం!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments