నేటి సత్యం కామారెడ్డి జూలై 30
లంచం అడిగిన అధికారులకు చెమటలు పట్టించిన గూడ్స్ లారీ డ్రైవర్ కామారెడ్డి జూలై 30 (నేటి సత్యం ప్రతినిధి) కామారెడ్డి జిల్లా ఎక్సైజ్ చెక్ పోస్ట్ లో అక్రమ వసూళ్ల పర్వం సాగుతుంది. ఈ ఘటనను గురువారం ఓ వాహనదారుడు తన మొబైల్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో విషయం బయటకు వచ్చింది. మద్నూర్ మండలంలోని సలాబత్ పూర్ అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద వచ్చి పోయే వాహనాల వద్ద అబ్కారీ అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఓ వాహనదారుడిని ఆపి 200 రూపాయలు డిమాండ్ చేయడంతో తిక్కరేగిన గూడ్స్ డ్రైవర్ ప్రశ్నల వర్షం కురిపించారు. మీ పేరు ఏమిటి, డ్రెస్ పై నేమ్ బోర్డ్ ప్లేట్ ఏమైంది అంటూ దిమ్మదిరిగే ప్రశ్నలు వేయడంతో అక్కడున్న అధికారులు అవక్కాయ్యారు. నాలుక కరుచుకున్న ఎక్సైజ్ అధికారి చాయి పాని కోసం డబ్బులు అడుగుతున్నామని బుకాయించిన వినిపించుకొని వాహనదారుడు తన ఫోన్ లో పూర్తి వీడియో రికార్డు చేసి ప్రభుత్వ అధికారుల తీరును సోషల్ మీడియాలో ఎండగట్టాడు. ఎన్ని పత్రాలున్న, ఏ ప్రాంతానికి వెళ్లిన తమకు లంచం తిప్పలు తప్పడం లేదంటూ ఆవేదన చెందుతూ ప్రభుత్వ అధికారుల తీరుపై తన అసంతృప్తిని వెళ్లగక్కాడు. నెల నెల టంచన్ గా జీతాలు తీసుకుంటున్న ప్రభుత్వ అధికారుల అక్రమ వసూళ్ల పై చర్యలు తీసుకోవాలంటూ పలువురు డిమాండ్ చేస్తు మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా ఒక వర్గం అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి వెనుకడుతుందని స్థానికులు అంటున్నారు