Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogపెద్దిరెడ్డి కుటుంబానికి రెండున్నర కోట్ల ఆర్థిక సాయం కేసీఆర్

పెద్దిరెడ్డి కుటుంబానికి రెండున్నర కోట్ల ఆర్థిక సాయం కేసీఆర్

నేటి సత్యం హైదరాబాద్ ఆగస్టు 8

*పెద్ది కుటుంబానికి పెద్దదిక్కుగా అధినేత కేసీఆర్*

స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి పార్టీ తరఫున రూ.2.25 కోట్ల ఆర్థిక సహాయం

పార్టీ సీనియర్లు, వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో చర్చించి నిర్ణయం తీసుకున్న అధినేత కేసీఆర్

ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలవాలని అధినేత కేసీఆర్ నిర్ణయించారు.

ఇందులో భాగంగా సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో కోటి రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించారు.

అదే సమయంలో, పెద్ది సుదర్శన్ రెడ్డి తల్లి శ్రీమతి అమృతమ్మ వృద్ధాప్యంలో ఉన్నందున ఆమె బాగోగుల కోసం మరో రూ.25 లక్షలను ఆమె పేరు మీద బ్యాంకులో జమ చేయాలని కేసీఆర్ గారు నిర్ణయించారు.

తద్వారా మొత్తంగా రూ.2.25 కోట్ల ఆర్థిక సహాయాన్ని పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అందిస్తూ బీఆర్ఎస్ పార్టీ అండగా నిలవాలని నిర్ణయించింది..

ఇంతటితోనే కాకుండా పిల్లల భవిష్యత్తు, వారి చదువు, ఇతర కుటుంబ సంక్షేమ అంశాలకు సంబంధించి పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తూ అండగా నిలుస్తుందని అధినేత కేసీఆర్ తెలిపారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments