నేటి సత్యం శేరిలింగంపల్లి ఆగస్టు 8
బోనాల పండుగ శుభాకాంక్షలు
శేర్లింగంపల్లి ప్రజలకు, సిపిఐ శ్రేణులకు, వివిధ రాజకీయ పార్టీల నాయకులకు, రెవెన్యూ అధికారులకు, పోలీసు అధికారులకు, జిహెచ్ఎంసి అధికారులకు, పారిశుధ్య కార్మికులకు, వర్కర్లకు, మీడియా మిత్రులకు బోనాల పండుగ శుభాకాంక్షలు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ ఆకాంక్షించారు.
బోనాల సందర్భంగా ప్రజలంతా పరస్పర సోదరభావంతో, ఐక్యతతో పండుగను జరుపుకోవాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. ముఖ్యంగా పోలీస్, జిహెచ్ఎంసి, రెవెన్యూ అధికారులు, పారిశుధ్య కార్మికులు ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించి పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కృషి చేయాలని సూచించారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని బోనాల అమ్మవారి ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
బోనాల పండుగ శుభాకాంక్షలు!