Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeUncategorizedసమాజం కోసం ఎలాంటి త్యాగాల కైనా సిద్ధంగా ఉండాలి:సదర్ ఖాజీ సయ్యద్ ఇఫ్తాఖర్ అలీ అన్వర్

సమాజం కోసం ఎలాంటి త్యాగాల కైనా సిద్ధంగా ఉండాలి:సదర్ ఖాజీ సయ్యద్ ఇఫ్తాఖర్ అలీ అన్వర్

త్యాగమయ జీవితం బక్రీద్

హాఫేజ్ సయ్యద్ మునవ్వర్ అలీ

షాద్ నగర్ లో ఘనంగా బక్రీద్ పండగ ఆధ్యాత్మిక వేడుకలు

ఖూర్బానీ ద్వారా సమాజానికి త్యాగ సందేశం అందించండి

సృష్టి ఎంతో అద్భుతమైనది.. .సకల చరాచరాలతో నిండి ఉన్న దీన్ని అల్లాహ్ సృష్టించాడనీ.. ఆయన ప్రసాదించిన ఈ జీవితాన్ని ఆయన కోసం త్యాగం చేసేందుకు వెనుకాడకూడదని సందేశాన్నిచ్చేదే పండుగ బక్రీద్ అని సదర్ ఖాజీ సయ్యద్ ఇఫ్తాఖర్ అలీ అన్వర్, హాఫేజ్ సయ్యద్ మునవ్వర్ అలీలు పండగ సందేశాన్ని ప్రజలకు అందజేశారు. శనివారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఫరూక్ నగర్ ఈద్గా వద్ద జరిగిన బక్రీద్ “ఈద్ ఉల్ ఆదా” నమాజ్ సందర్భంగా ముస్లిం సమాజానికి సందేశాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ఈ పండుగ ప్రవక్త ఇబ్రహీం త్యాగనిరతి, సహనశీలత, రుజు వర్తనలను తెలుపుతుందన్నారు.
మానవాళికి మార్గదర్శకత్వం వహించడానికి దైవం పక్షాన అవతరించిన ప్రవక్తల్లో ఇబ్రహీం ఒకరనీ ఈ సకల చరాచర సృష్టికి కారకుడని, ఆయన పట్ల భక్తి, శ్రద్ధలు ప్రకటించడం ద్వారా ముక్తిని పొందవచ్చని జాతికి పిలుపునిచ్చారు. ఇస్లాంలో బక్రీద్ కు ప్రాధాన్యత ఉందనీ అన్నారు.
శనివారం ఈ పండుగను ముస్లింలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని ఆర్థికంగా ఇబ్బందులు లేని ప్రతి వ్యక్తి ఖుర్బానీ ఇవ్వడం ఈ పండుగ సంప్రదాయం అన్నారు. ఖుర్బానీ ద్వారా వచ్చిన మాంసాన్ని మూడు భాగాలు చేసి ఒక వంతు పేదలకు, రెండో భాగాన్ని బంధుమిత్రులకు, మరో భాగాన్ని తమ కోసం వాడుకోవాలని వారు సూచించారు. అందరూ ఐకమత్యంగా ఉంటూ శత్రువులను సైతం ఈ పండుగ సందర్భంగా పలకరించాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని విషయాలు త్యాగనిరతిని పెంపొందించుకోవాలని కోరారు.

సంఘటితం కావాలి..

దేశంలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ముస్లిం జాతినీ ఇబ్బందులకు గురి చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని మాజీ సదర్ ఖాజీ సయ్యద్ ముక్తదిర్ అలీ ఈ సందర్భంగా ఈద్గా వేదికపై మాట్లాడారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయన ముస్లిం సమాజంతో మాట్లాడుతూ.. వక్ఫ్, బాబ్రీ మసీదు అంశాలను ప్రస్తావించారు. ఏ విషయంలోనైనా ముస్లిం సమాజానికి హాని కలిగే విధంగా కొన్ని చట్టాలు కేంద్రం రూపొందిస్తుందని పేర్కొన్నారు. వీటిని ఎదుర్కోవడానికి ముస్లిం సమాజం సంగటితం కావలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
నమాజ్ అనంతరం ముస్లిం సోదరులు ఒకరికి ఒకరు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments