శేర్లింగంపల్లి జూన్ 12
ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీని అరికట్టాలి
పిల్లల తల్లిదండ్రులపై పెను భారం మోపడం సహించం-
టి. నితీష్ ధర్మతేజ, ఏఐఎస్ఎఫ్ నాయకుడు
శేరిలింగంపల్లి నియోజకవర్గం లో .ప్రైవేట్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా ఫీజులను పెంచుతూ విద్యను వ్యాపారంగా మార్చడం అత్యంత దురదృష్టకరమని ఏఐఎస్ఎఫ్ నాయకుడు టి. నితీష్ ధర్మతేజ తీవ్రంగా ఆక్షేపించారు. ఇప్పటికే పెరిగిన ధరలు, నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న మధ్యతరగతి, పేద కుటుంబాలపై ప్రైవేట్ పాఠశాలల ఫీజుల భారం మరింత పెరిగిందన్నారు.
ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా ప్రైవేట్ యాజమాన్యాల చేతుల్లో వదిలేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు. ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ప్రైవేట్ పాఠశాలలు తల్లిదండ్రులను నిలువునా దోచుకుంటున్నాయని అన్నారు. అడ్మిషన్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు, బస్సు ఫీజులు, పుస్తకాలు, యూనిఫారాలు పేరుతో వేలాది రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్య హక్కు కానీ వ్యాపారం కాదని, విద్యను లాభాల కేంద్రంగా మార్చే యాజమాన్యాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ప్రైవేట్ పాఠశాలల ఫీజులను నియంత్రించాలని, తల్లిదండ్రుల ఫిర్యాదులను స్వీకరించి చర్యలు తీసుకోవాలని కోరారు.
లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని టి. నితీష్ ధర్మతేజ హెచ్చరించారు.
ప్రభుత్వ పాఠశాలలను పరిసరాలను శుభ్రపరిచి. విద్యార్థులకు మెరుగైన వాతావరణం లో చదువును బోధించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం ప్రతి ఒక్క విద్యార్థి బడి బాట పట్టాలని విద్యార్థులను బడికి పంపాలని తల్లిదండ్రులను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాము