నేటి సత్యం కొండాపూర్ జూన్ 11
సూచించిన డంపింగ్ యార్డులోనే చెత్త, నిర్మాణ వ్యర్థాలను వేయాలి వేణుగోపాల్ రెడ్డి, ఏసీ హెచ్ఎండీఏస్
హైటెక్ ట్రాక్టర్స్ యూనియన్ మరియు రామ్‌కీ సంస్థ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఏసీ హెచ్ఎండీఏస్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ నగర పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
ప్రభుత్వం గుర్తించి సూచించిన డంపింగ్ యార్డుల్లోనే చెత్త, నిర్మాణ వ్యర్థాలు (డెబ్రీస్) వేయాలని ఆయన స్పష్టం చేశారు. రోడ్ల పక్కన, ఖాళీ స్థలాల్లో, చెరువులు మరియు ప్రజా ప్రదేశాల్లో చెత్త, డెబ్రీస్ వేయడం వల్ల పర్యావరణ కాలుష్యం పెరగడమే కాకుండా ప్రజారోగ్యానికి కూడా తీవ్ర ముప్పు వాటిల్లుతుందని అన్నారు.
నగర సౌందర్యాన్ని కాపాడేందుకు, పరిశుభ్రమైన వాతావరణాన్ని నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి ఎక్కడపడితే అక్కడ చెత్త, డెబ్రీస్ వేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
హైటెక్ ట్రాక్టర్స్ యూనియన్, రామ్‌కీ సంస్థ ప్రతినిధులు కూడా ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ సూచించిన డంపింగ్ యార్డుల్లోనే వ్యర్థాలను తరలించేందుకు సహకరిస్తామని తెలిపారు. ఒక టన్నుకు 430. రాంకీ సంస్థకు ట్రాక్టర్ ఓనర్లు చెల్లించాలి. రోడ్ల పైన ఎక్కడ డంపు చేసిన కఠిన చర్యలు తప్పవు 25000 పెనాల్టీ టైర్లలో గాలి తీసివేస్తారు రెండోసారి దొరుకుతే 50,000 పేనాల్టీ గాలి తీసివేస్తారు టైర్లలో మూడవసారి దొరికితే లక్ష రూపాయలు టైర్లలో గాలి తీసివేస్తారు ఇలా కఠినమైనటువంటి చర్యలు ఉన్నాయి
ఈ సమావేశంలో సంబంధిత అధికారులు, యూనియన్ ప్రతినిధులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిసి బాలకృష్ణ. రూపా దేవి ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి టి రామకృష్ణ హైటెక్ టాక్టర్స్ యూనియన్ ప్రెసిడెంట్ టి శ్రీకాంత్ టి నాగేష్ ఎల్లప్ప మారన్న శేఖర్ తదితరులు పాల్గొన్నారు