Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogరోడ్ సేఫ్టీ అవగాహన సదస్సు..

రోడ్ సేఫ్టీ అవగాహన సదస్సు..

ఘనంగా అరైవ్ అలైవ్ రోడ్ సేఫ్టీ అవగాహన సదస్సు

గన్నేరువరం, ఏప్రిల్ 13 (నేటి సత్యం):

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గన్నేరువరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం అరైవ్ అలైవ్ – రోడ్ సేఫ్టీ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్‌ల అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో వాహనదారులు పాటించాల్సిన నియమాలు, రహదారి భద్రత ప్రాముఖ్యతపై చర్చించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ రంగనవేణి లచ్చినర్సు మాట్లాడుతూ , ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రాణాపాయాల నుండి బయటపడవచ్చని అవగాహన కల్పించారు. రహదారి భద్రత అనేది కేవలం ఒక నిబంధన మాత్రమే కాదని, అది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ప్రమాణం కూడా చేశారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెంకటరెడ్డి, పోలీస్ సిబ్బంది, గ్రామపంచాయతీ కార్మికులు,వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, హెల్త్ ఆశా వర్కర్లు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments