సమావేశానికి వెళుతూ రామాపురం
పంచాయతీ సెక్రెటరీ మృతి…
(యస్.పి. మల్లికార్జున సాగర్).
కొల్లాపూర్, మే 22, నేటి సత్యం.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం లో జరుగుతున్న సమావేశం లో పాల్గొనేందుకు విధి నిర్వహణలో భాగం గా మోటారు సైకిల్ పై వెళుతున్న రామాపురం గ్రామ పంచాయతీ కార్యదర్శి పవన్ కుమార్ (38) ను కారు “ఢీ” కొట్టడం తో అకాల మృతి చెందారు.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం లో శుక్రవారం రోజు జరుగుతున్న ” ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ”
కార్య క్రమం లో హాజరు అయ్యేందుకు ఇది నిర్వహణ లో భాగం గా నాగర్ కర్నూలు కు కొల్లాపూర్ మండలం లోని తన సొంత గ్రామమైన
యనమన్ బెట్ల గ్రామం నుంచి
తన టు వీలర్ బైక్పై పై బయలుదేరి నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం కు శుక్రవారం రోజు వెళుతుండగా పెద్దకొత్తపల్లి మండలం
కల్వకోలు, చెన్నపురవపల్లి, మధ్య లో
హైదరాబాద్ నుండి కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం కు వస్తున్న ప్రైవేటు కారు, ఎదురుగా పవన్ కుమార్ ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్ ను “ఢీ”కొట్టడం తో పంచాయతీ కార్యదర్శి పవన్ కుమార్ తీవ్ర గాయాల పాలైనారు.
కాగా వెంటనే ఆయనను అంబులెన్స్ లో
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం లోని ఆసుపత్రి కి తరలించి
ప్రథమ చికిత్స చేస్తుండగా, అప్పటికే గాయపడి ఉన్న రామాపురం గ్రామ పంచాయతీ కార్యదర్శి పవన్ కుమార్ చనిపోయాడని డాక్టర్లు తెలియ జేశారు.
కాగా పవన్ కుమార్ ను ” డి” కోట్టిన
కారు ని పెద్ద కొత్త పల్లి పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలించారు.
కాగా విధి నిర్వహణలో ప్రమాదానికి గురై మరణించిన రామాపురం గ్రామపంచాయతీ కార్యదర్శి పవన్ కుమార్ మృతి పట్ల కొల్లాపూర్ అసెంబ్లీ నియోజక వర్గ పంచాయతీ కార్యదర్శిల సంఘ సభ్యులు, జిల్లా సంఘ సభ్యులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.