నేటి సత్యం శేరిలింగంపల్లి జూన్ 2
తెలంగాణ రాష్ట్ర 12వ అవతరణ దినోత్సవ* *శుభాకాంక్షలు
*ప్రత్యేక తెలంగాణ సాధన అమరవీరుల త్యాగాల ఫలితం ప్రజల ఆకాంక్షల తెలంగాణ కోసం పోరాటం కొనసాగాలి*
తెలంగాణ రాష్ట్ర 12వ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ తెలిపారు.
దశాబ్దాల పాటు సాగిన తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, రైతులు, కార్మికులు చేసిన త్యాగాలు, పోరాటాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలను తెలంగాణ సమాజం ఎప్పటికీ మరువదన్నారు.
రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తవుతున్నా ప్రజలు ఆశించిన సామాజిక న్యాయం, భూ సంస్కరణలు, నిరుద్యోగ నిర్మూలన, రైతులకు గిట్టుబాటు ధరలు, పేదలకు గృహాలు, ప్రభుత్వ విద్యా-వైద్య రంగాల బలోపేతం వంటి అనేక అంశాలు ఇంకా పూర్తిస్థాయిలో నెరవేరలేదని పేర్కొన్నారు.
తెలంగాణ సంపదపై కొద్దిమంది కార్పొరేట్ శక్తుల ఆధిపత్యం పెరగకుండా, రాష్ట్ర వనరులు ప్రజల సంక్షేమానికి వినియోగించే విధానాలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు, కార్మికులు, ఉద్యోగులు, యువత, మహిళల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలన్నారు.
అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా సమానత్వం, లౌకికవాదం, సామాజిక న్యాయం, ప్రజాస్వామిక విలువలతో కూడిన తెలంగాణ నిర్మాణమే వారికి నిజమైన నివాళి అవుతుందని టి. రామకృష్ణ పేర్కొన్నారు.
జై తెలంగాణ!
అమరవీరుల ఆశయాలు వర్ధిల్లాలి!
ప్రజల తెలంగాణ సాధన కోసం సిపిఐ పోరాటం కొనసాగుతుంది!
–