నేటి సత్యం అబ్దుల్లాపూర్ మెట్టు జూన్ 5
విద్యార్థి ప్రాణాలకు బాధ్యత ఎవరిది..? శ్రీ చైతన్య యాజమాన్యమా..? తెలంగాణ ప్రభుత్వమా..?
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి కోమటిరెడ్డి దేవేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన తెలుసుకున్న వెంటనే ఏఐఎస్ఎఫ్ నాయకులు అక్కడికి చేరుకుని నిరసన కార్యక్రమం నిర్వహించారు.
విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడి, కార్పొరేట్ విద్యాసంస్థల నిర్లక్ష్యం, మార్కుల కోసం మానసిక వేధింపులు కొనసాగుతుంటే ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోంది? మరెంత మంది విద్యార్థుల ప్రాణాలు బలైతే ప్రభుత్వం స్పందిస్తుంది? విద్యను వ్యాపారంగా మార్చిన కార్పొరేట్ కళాశాలలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు?
దేవేందర్ రెడ్డి మరణంపై సమగ్ర న్యాయ విచారణ జరిపి, బాధ్యులైన శ్రీ చైతన్య యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి సామిడి వంశీ వర్ధన్ రెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి చింత వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షులు వినోద్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉపేందర్, హయత్నగర్ మండల సహాయ కార్యదర్శి గణేష్ తదితర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.