Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogగుడిసెల్లో నివాసం ఉన్నవారికి పట్టాలు ఇవ్వండి జంగయ్య

గుడిసెల్లో నివాసం ఉన్నవారికి పట్టాలు ఇవ్వండి జంగయ్య

నేటి సత్యం చేవెళ్లే జూలై 1

గుడిసెలు వేసుకున్న గుడిసె వాసులకు వెంటనే పట్టాలు ఇవ్వండి

ఇండ్ల స్థలాలు లేని వారికి ఇండ్ల స్థలాలు కేటాయించాలి

అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వండి

గతంలో పట్టాలు ఇచ్చి పొజిషన్ చూపించండి వారికి ఇండ్ల స్థలాల పొజిషన్ చూపించాలి

*సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్*

ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ చేవెళ్ల మండలం లోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుండి RDO కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఆర్టీవో కార్యాలయం ముందు సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సిపిఐ నియోజకవర్గ ఇన్చార్జి కే రామస్వామి అధ్యక్షతన మహా ధర్నాను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ జాతీయ సమితి సభ్యులు జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య హాజరై మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశములో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు రోజురోజుకు తగ్గుతూ ఉంటే భారతదేశంలో మాత్రం దానికి భిన్నంగా రోజురోజుకు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరుగుతున్నాయని పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని అదేవిధంగా రాష్ట్రంలో ప్రజా పాలన ప్రభుత్వం కూడాఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు చేవెళ్ళ లోని 75వ సర్వే నెంబర్ లో గత నాలుగు సంవత్సరాలుగా గుడిసెలు వేసుకొని భూ పోరాటం నిర్వహిస్తున్న గుడిసేవాసులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని అక్కడ మంచినీరు కరెంటు రోడ్డు మొబైల్ టాయిలెట్స్ మొదలైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రజా పాలన ప్రభుత్వం వచ్చి 30 నెలలు గడుస్తున్న ఇండ్ల స్థలాలు లేని వారికి ఇండ్ల స్థలాలు ఇవ్వడం లేదని అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించడం లేదని చేవెళ్ల నియోజకవర్గం లోని వందలాది నిరు పేద లకు గతంలో గత ప్రభుత్వాలు పట్టాలు ఇచ్చాయని వారికి మాత్రం ఇంత వరకు ప్రభుత్వాలు మారిన ఇండ్ల స్థలాల పొజిషన్ మాత్రం చూపించడం లేదని తెలిపారు ఇప్పటికైనా ప్రభుత్వం మరియు ప్రభుత్వ అధికారులు ముందుకు వచ్చి అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏం ప్రభు లింగం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్ల సత్యనారాయణ షాబాద్ మండల కార్యదర్శి పాలమాకుల శ్రీశైలం శంకర్పల్లి మండల కార్యదర్శి సుధీర్ జిల్లా కౌన్సిల్ సభ్యులు సుధాకర్ గౌడ్ md మక్బూల్ వడ్ల మంజుల j అంజయ్య ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు బాబురావు శ్రీను జలీల్ వెంకయ్య రఘు మధు లలిత జయమ్మ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments