Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogఇల్లు ఇంటిజాగా ఇవ్వండి బాల నరసింహ

ఇల్లు ఇంటిజాగా ఇవ్వండి బాల నరసింహ

నేటి సత్యం నగర్ కర్నూల్ జూలై 1

అర్హులైన పేద ప్రజలకు ఇల్లు ఇంటి జాగా ఇవ్వకపోతే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుంది సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఏం బాల నరసింహ*

జిల్లాలో రాష్ట్రంలో ఉన్న లక్షలాదిమంది నిరుపేదలకు భూదాన భూమి మరియు ఇతర ప్రభుత్వ భూముల్లో ఇంటి స్థలాలు కేటాయించాలని అర్హులైన పేద ప్రజల కు ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ మరియు సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో స్థానిక నాగర్కర్నూలు కలెక్టరేట్ ముందు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ అధ్యక్షతన ధర్నా ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాల నరసింహ గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో జిల్లాలో అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు వేల ఎకరాలు డబ్బున్న బడాబాబులు కబ్జా చేస్తున్న వాటిపై పల్లెతో మాట కూడా మాట్లాడని ప్రభుత్వాలు పేద ప్రజలు వేసుకున్న గుడిసెలను కూలగొడుతూ వాళ్ళని తీవ్రంగా హింసిస్తున్నారన్నారు 80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ దేశ పౌరులు ఇంటి స్థలాల కోసం పోరాడుతుండడం దేశంలో ఉన్న పరిస్థితి నీ వివరిస్తుందన్నారు రాష్ట్రంలోని అనేక జిల్లాలో భూదాన భూములు వేల ఎకరాల్లో ఉన్న వాటిని కబ్జా నుంచి విడిపించి పేదలకు పంచమంటే ఆ వైపుకు ప్రభుత్వాలు ముందు కదలడం లేదు అని బాల నరసింహ విమర్శించారు ఇద్దరమ్మా ఇల్లు కేటాయింపులు తీవ్రంగా రాజకీయాలు సౌఖ్యం జరుగుతుందని ఆయన మండిపడ్డారు తమకు నచ్చిన వారికి మాత్రమే ఇల్లు కేటాయిస్తున్నారని ఆయన విమర్శించారు ప్రజా సమస్యలపై కమ్యూనిస్టు పార్టీల ఐక్య పోరాటాలకు ఇది నాంది అని ఇకపై ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాలని కచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటామని ఆయన వివరించారు సిపిఎం జిల్లా కార్యదర్శి గత ప్రభుత్వం జిల్లాలోని అనేక గ్రామాలలో ఇల్లు స్థలాలు లేని పేదలకు ఇంటి జాగాలు కేటాయించడానికి కొనుగోలు చేసిన భూములను ప్రభుత్వం పేద ప్రజలకు పంచకుండా ఇతర కార్యక్రమాలకు వాడుకుంటుందని ఆయన విమర్శించారు ప్రజా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జిల్లాలో అనేకమంది వందల కొద్ది గ్రామాల్లో ఇంటి జాగా లేని నిరుపేద కుటుంబాలు ఉన్నాయని ఆయన వివరించారు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ జిల్లాలో అనేక అడవి అడవి అసైన్మెంట్ భూములను కార్పొరేట్ కంపెనీలు కన్నేసి అక్రమంగా కబ్జా చేస్తుంటే వాటిని నివారించలేని ప్రభుత్వాలు పేద ప్రజలు ఎక్కడైనా జానెడు గుడి చేసుకుంటే ఇల్లు కట్టుకుంటే దాని కూల్చేందుకు నడుము గడిచేయడం అనేది ప్రజాస్వామ్యస్ఫూర్తికి విరుద్ధమన్నారు ఎప్పుడు కూడా ప్రజా పోరాటాలను అని చేయాలని చూస్తే ఆ ప్రభుత్వాలు కాలగర్భంలో కలుస్తాయని చేదు నిజం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వ పెద్దలు గమనించాలని భయాజ్ వివరించారు ఈ నెల 6వ తేదీన ఇదే అంశాలపై హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి అర్హులందరికీ ఇండ్లు ఇంటి జాగాలో కేటాయించాలని పేద ప్రజలు కట్టుకున్న ఇండ్లపై పోలీసులను అడ్డం పెట్టుకొని సాగించే దౌర్జన్యకాండను స్వస్తి పలకాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కేశవ గౌడ్ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ శీను దేశా నాయక్ కందికొండ గీత సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఈ నరసింహ ఈ చంద్రమౌళి ఆర్ ఇందిరా శంకర్ గౌడ్ బొల్లెద్దుల శ్రీనివాసులు బండి లక్ష్మీపతి శివశంకర్ సిపిఎం శ్రీనివాసులు నరసింహ ఆంజనేయులు రామయ్య ఆంజనేయులు ఆంజనేయులు బాలస్వామి ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు టి మల్లయ్య ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి శ్రీనివాసులు ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రేమ్ కుమార్ కిరణ్ కుమార్ వి రవీందర్ కృష్ణాజి మధు గౌడ్ తదితరులు పాల్గొన్నారు అంతకుముందు కొల్లాపూర్ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు ప్రదర్శన ఇరు పార్టీల నాయకులు నిర్వహించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments