Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogదోషులను శిక్షించమంటే లాటి చార్జ్ చేస్తారా..!

దోషులను శిక్షించమంటే లాటి చార్జ్ చేస్తారా..!

నేటి సత్యం శేరిలింగంపల్లి జూలై 20

ఢిల్లీలో విద్యార్థులు, యువతపై పోలీసుల లాఠీచార్జీ అమానుషం

నీట్ పేపర్ లీకేజీ దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి* – *కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి

టి. రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు

ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై న్యాయం కోరుతూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, యువతపై పోలీసులు లాఠీచార్జీ చేయడం అత్యంత అమానుషమని, ప్రజాస్వామ్య హక్కులపై దాడిగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ తీవ్రంగా ఖండించారు.

నీట్ పరీక్షలో జరిగిన పేపర్ లీకేజీ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన తీవ్రమైన కుంభకోణమని పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన అసలు సూత్రధారులను కాపాడుతూ, న్యాయం కోరుతున్న విద్యార్థులపై పోలీసు బలప్రయోగానికి పాల్పడటం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమన్నారు.

విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వం వారిపై లాఠీలు ఎత్తడం సిగ్గుచేటని అన్నారు. పేపర్ లీకేజీకి బాధ్యులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, ఈ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

దేశ యువతకు నాణ్యమైన, పారదర్శకమైన విద్యా వ్యవస్థను అందించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని, కానీ పరీక్షల నిర్వహణలో వరుస వైఫల్యాలు, అవినీతి, నిర్లక్ష్యంతో విద్యార్థుల విశ్వాసాన్ని ప్రభుత్వం దెబ్బతీస్తోందని విమర్శించారు.

విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, పోలీసుల దౌర్జన్యంపై స్వతంత్ర విచారణ జరిపించాలని, నీట్ పేపర్ లీకేజీ కుట్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుని బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని టి. రామకృష్ణ డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments