Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogహక్కుల సాధనకై గర్జించిన కార్మికులు

హక్కుల సాధనకై గర్జించిన కార్మికులు

విజయవంతంగా ఏఐటీయూసీ నాగర్ కర్నూల్ జిల్లా 3వ మహాసభలు.

తాడూర్ మండల కేంద్రంలో భారీ ర్యాలీ, కార్మికుల గర్జన.

కార్మికుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా ఏఐటీయూసీ జిల్లా 3వ మహాసభలు ఆదివారం తాడూర్ మండల కేంద్రంలో ఘనంగా జరిగాయి. జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన కార్మికులు ఎర్రజెండాలతో, నినాదాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.

తాడూర్ ప్రధాన రహదారుల గుండా సాగిన ర్యాలీ సభా ప్రాంగణానికి చేరుకుంది. “లేబర్ కోడ్స్ రద్దు చేయాలి”, “కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి”, “కనీస వేతనం 26 వేలు ఇవ్వాలి” అంటూ నినాదాలు మార్మోగాయి.

అనంతరం మండల కేంద్రంలో ని ఫంక్షన్ హాల్ లో ఏఐటీయూసీ జిల్లా నాయకులు పి పరుషరాములు,పి.కిరణ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన మహాసభల్లో

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు యం.బాలనర్సింహ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వెంటనే ఆపాలని, కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.సంఘటిత అసంఘటిత కార్మికుల హక్కుల కోసం మరింత పటిష్టంగా పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి యం.నర్సింహ మాట్లాడుతూ, వివిధ రంగాల కార్మికులు ఏఐటీయూసీ జెండా కింద ఏకం కావాలని పిలుపునిచ్చారు. పెండింగ్‌లో ఉన్న బకాయిలు, ఇన్సెంటీవ్లు, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు సకాలంలో అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

తెలంగాణ మున్సిపల్ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ, మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని మున్సిపల్ కార్మికులకు 15 క్యాజువల్ 8 పండుగ సెలవులు అమలు చేయాలని అన్నారు. అనారోగ్యంతో మరణించిన కార్మికుని కుటుంబంలో మరియు 60 సంవత్సరాలు పైబడిన కార్మికుల స్థానంలో వారి కుటుంబంలో ఒకరికి వారసత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. జనాభాకు అనుగుణంగా కార్మికులను పెంచాలన్నారు.

సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ యం డి ఫయాజ్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటంలో పాల్గొన్న ఏకైక సంఘం ఏఐటీయూసీ.అనినాటి నుండి నేటి వరకు కార్మిక దేశంలో కార్మిక వర్గం పక్షాన నిలబడి హక్కు ల కోసం అలుపెరుగని పోరాటలు నిర్వహిస్తున్న సంఘం ఏఐటీయూసీ అని మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

తీర్మానాలు*

సభలో కింది డిమాండ్లతో తీర్మానాలు చేశారు:

1. అన్ని రంగాల కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి

2. ఆన్ డ్యూటీ ప్రమాదాలకు పూర్తి వైద్య సదుపాయం, ఎక్స్‌గ్రేషియా అమలు

3. స్మార్ట్ మీటర్లు, టెండర్ విధానాలతో ఉపాధి కోల్పోతున్న కార్మికులను ఆదుకోవాలి

4. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలి

ఈ మహాసభలు కార్మికుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయని, రాబోయే ఉద్యమాలకు దిశానిర్దేశం చేశాయని నాయకులు తెలిపారు.

కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి ఏఐటీయూసీ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments