నేటి సత్యం కామారెడ్డి ఆగస్టు5
ఆసుపత్రిలో శస్త్రచికిత్స లు ప్రారంభించడానికి సన్నాహాలు
బాన్సువాడ పట్టణంలోని మాత శిశు సంక్షేమ ఆసుపత్రి ఉమ్మడి జిల్లా లోనే మంచి పేరు ప్రతిష్టలు ఉన్న ఆసుపత్రి గతంలో ఈ ఆసుపత్రికి రాష్ట్ర స్థాయిలో సైతం అనేక అవార్డులు కూడా వచ్చిన దాఖలాలు ఉన్నాయి అలాంటిది గత కొన్ని రోజుల క్రితం జరిగిన సంఘటన వల్ల కొంత డ్యామేజ్ ఏర్పడిందని స్థానిక ప్రజలు అంటున్నారు కారణాలు ఏమైనాప్పటికీ ప్రస్తుతం ఆస్పత్రికి రావాలంటే ముఖ్యంగా డెలివరీలకు ఆపరేషన్లకు వచ్చేందుకు మహిళలు భయాందోళనకు గురవుతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా సంఘటనలు సీరియస్ గా తీసుకొని సంబంధిత వ్యక్తులపై వేటు వేసింది ప్రస్తుతం ఆసుపత్రిని తిరిగి గాడిలో పెట్టేందుకు గత ప్రతిష్టను తిరిగి వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లకు అధికారులు స్థానిక నాయకులు సిద్ధపడినట్లు తెలుస్తోంది దీనిలో భాగంగానే ఎంతో అనుభవo ఉన్న డాక్టర్ శ్రీనివాస్ ఇక్కడికి బదిలీ చేశారు అధికారులు ఆయన కూడా ఎప్పటికప్పుడు డాక్టర్లతో సిబ్బందితో సమీక్షలు నిర్వహిస్తూ ఆస్పత్రిలో ఉన్న సమస్యలను ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి ఆసుపత్రికి కావలసిన సిబ్బందిని వైద్యులను ఏర్పాటు చేసుకునే పనిలో నిమగ్నమై ఉన్నారు రెండు మూడు రోజుల్లో మళ్లీ ఆపరేషన్ థియేటర్ ను తెరిచి ప్రజలకు అవసరమైన అన్ని శస్త్ర చికిత్సలను అందుబాటులోకి తేవడం జరుగుతుందని బుధవారం మీడియాతో తెలిపారు ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు స్థానిక ప్రజలు పాలకులు అధికారులు సిబ్బంది మీడియా కూడా సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు