Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogఆగస్టు 17 నుండి సిపిఐ ప్రజా చైతన్య యాత్ర

ఆగస్టు 17 నుండి సిపిఐ ప్రజా చైతన్య యాత్ర

నేటి సత్యం / శంషాబాద్ / ఆగస్టు 13

సిపిఐ రంగారెడ్డి జిల్లా.ప్రజా చైతన్య యాత్రను విజయవంతం చేయండి

సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య

. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ రంగారెడ్డి జిల్లా ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని దీనిని విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య పార్టీ శ్రేణులకు ప్రజలకు పిలుపునిచ్చారు

ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికలను నేడు సిపిఐ నాయకులతో కలిసి శంషాబాద్ మండల కేంద్రంలో ఆయన విడుదల చేశారు

ఈ సందర్భంగా జంగయ్య మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉద్యోగ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నారని ఆ విధానాలను వ్యతిరేకిస్తూ సిపిఐ జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా రంగారెడ్డి జిల్లాలో సెప్టెంబర్ 17 నుండి 21 వరకు జిల్లావ్యాప్తంగా రంగారెడ్డి జిల్లా ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు

రంగారెడ్డి జిల్లా అన్ని విధాలుగా అభివృద్ధి కావాలంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు

స్థానిక పరిశ్రమలలో స్థానికులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అన్నారు జిల్లాలో విద్యారంగాన్ని వైద్య రంగాన్ని అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్ చేశారు

పట్టణ ప్రాంతాలకు గ్రామీణ ప్రాంతాలకు అనుసంధానమయ్యే రహదారులను తక్షణమే అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్ చేశారు

రంగారెడ్డి జిల్లాలో విస్తృతంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చి కోట్లు దండుకుంటున్నారు కానీ రాబోయే కాలంలో దీని ద్వారా ఆహార కొరత ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని అన్నారు

వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చేటప్పుడు ప్రభుత్వం చట్టాలను పర్యనులోకి తీసుకోవాలని ఆయన సూచించారు

ఈనెల 17న చేవెళ్ల పట్టణంలో ప్రారంభం అవుతుందని ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ నెలికంటి సత్యం హాజరవుతారని ఆయన తెలిపారు

పోస్టర్ విడుదల కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆందోజు రవీంద్ర చారి రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు పుస్తకాల నర్సింగ్ రావు సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు ముత్యాల యాదిరెడ్డి ఓరుగంటి యాదయ్య టి రామకృష్ణ బుద్ధుల జంగయ్య

జిల్లా కార్యవర్గ సభ్యులు కావలి నరసింహ ఎం ప్రభు లింగం కన్య గారి నరసింహారెడ్డి ఆర్ యాదగిరి నీలమ్మ శేర్లింగంపల్లి మండల కార్యదర్శి కే చందు యాదవ్ ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి కావలి సురేష్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments