Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogఅధ్యాపకుల నియామకంలో జాప్యం..?

అధ్యాపకుల నియామకంలో జాప్యం..?

నేటి సత్యం/ బాన్సువాడ/ ఆగస్టు 22

అధ్యాపకుల నియామకంలో జాప్యంపై విద్యార్థుల నిరసన

బాన్స్ వాడ పట్టణంలో  పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు తమ విద్యా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం కళాశాల ఆవరణలో నిరసనకు దిగారు. ముఖ్యంగా జువాలజీ, సివిక్స్‌ తదితర సబ్జెక్టుల బోధన సరిగా అర్థం కావడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తరగతుల్లో పాఠ్యాంశాలను సులభంగా అర్థమయ్యే విధంగా బోధించాలని, విద్యార్థులకు సందేహ నివృత్తి చేసేలా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని కోరారు.

పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో సబ్జెక్టులపై స్పష్టత లేకపోవడంతో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ అబ్దుల్ సలాం విద్యార్థుల సమస్యలను వెంటనే పరిశీలించి, అవసరమైన బోధనా చర్యలు చేపట్టాలని వారు కోరారు. సంవత్సరం గడుస్తున్న విద్యార్థుల సమస్యలు పట్టించుకోవడంలేదని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని విద్యార్థులు వాపోయారు. తక్షణమే నూతన లెక్చర్లను ఏర్పాటు చేయాలని లేనియెడల ఆందోళనను మరింత ఉదృతం చేస్తామని ఆవరణలో బయటాయించారు

. ప్రతిరోజు ప్రైవేట్ క్లాసులకు బయట వెళ్తున్నామని మా బాధ ఎవరు పట్టించుకుంటారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు రోజుల్లోగా లెక్చర్లలను నియమిస్తామని కళాశాల ప్రిన్సిపల్ జిల్లా నోడల్ అధికారి సలాం విద్యార్థులకు హామీ ఇచ్చారు. సంవత్సరంగా ఫిర్యాదులు ఇచ్చిన పట్టించుకోలేని ప్రిన్సిపాల్ ఐదు రోజుల్లో ఎలా నియమిస్తారంటూ విద్యార్థులు నిలదీశారు. తక్షణమే లెక్చర్లను నియమించేంతవరకు నిరసన విరమించేది లేదంటూ విద్యార్థులు బైఠాయించారు. శాశ్వత పరిష్కారం చేసే వరకు నిరసన విరమించేది లేదంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments