నేటి సత్యం
మద్నూర్ జాతీయ రహదారి పై బస్సు బోల్తా డ్రైవర్ మృతి
కామారెడ్డి సెప్టెంబర్ 4 నేటి సత్యం ప్రతినిధి కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం చౌరస్తా సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం జాతీయ రహదారి 161 పై హైదరాబాద్ డిపో 1 కు చెందిన బస్సు బోల్తా కొట్టడంతో బస్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా వారిని బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రికి హుటా హుటిన తరలించారు
హైదరాబాదు నుండి బిచ్కుంద వెళుతున్న టి జి 35 జెడ్ 0030 ఆర్టీసీ బస్సు
ప్రమాదవశత్తు కల్వర్టును ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు
బస్సు డ్రైవరు అక్కడిక్కడే మృతి చెందగా
బస్సులో 14 మంది ప్రయాణికులు పయనిస్తుండడంతో వీరికి తీవ్ర గాయాలు అయ్యాయి బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రికి స్థానిక పోలీసులు క్షతగాత్రులను తరలించారు ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్ అయిందా మరి ఏదైన ఇతర కారణంతో ప్రమాదం జరిగిందా అని పోలీసులు విచారణ చేపట్టుతున్నారు