Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogగన్నేరువరంలో ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య

గన్నేరువరంలో ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య

గన్నేరువరం, మే 03 (నేటి సత్యం):

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన న్యాత ప్రేమ్ సాగర్ (30) అనే యువకుడు శనివారం అర్ధరాత్రి తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఘటన వివరాలు:స్థానికులు మరియు కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ప్రేమ్ సాగర్ శనివారం రాత్రి యధావిధిగా నిద్రకు ఉపక్రమించాడు. అయితే అర్ధరాత్రి సమయంలో ఇంట్లోనే ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు. ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులు గమనించే సరికి ప్రేమ్ సాగర్ నిర్జీవంగా వేలాడుతూ కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ వార్త తెలియడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.సమాచారం అందుకున్న గన్నేరువరం పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పంచనామా నిర్వహించిన అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments