Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogకార్మికులకు పెంచింది శూన్యం...

కార్మికులకు పెంచింది శూన్యం…

నేటి సత్యం హైదరాబాద్ మే 22

కార్మికులకు పెంచింది శూన్యం

తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ సంఘం రాష్ట్ర కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాప్ అండ్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వనంపల్లి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు కనీస వేతనాలు పెంచుతున్నామని చెప్పడం జరిగింది. రాష్ట్రంలో వివిధ పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు మున్సిపల్ కార్పొరేషన్ జోన్ 1 పరిధిలో కనీస వేతనం 16,000 రూపాయలు, మున్సిపల్ జోన్ 2 పరిధిలో 15000/-రూపాయలు, గ్రామీణ ప్రాంతాలలో జోన్ 3 పరిధిలో14000/-రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. కానీ ఒక దిక్కు రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనం 20,000 రూపాయలని చెప్పుకోవడం సిగ్గుచేటు.

గత రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 60 విడుదల చేయడం జరిగింది. మూడు క్యాటగిరీలుగా విభజించి కేటగిరి వన్ వారికి కనీస వేతనం 15600 రూపాయలు, కేటగిరి 2 స్కిల్డ్ 19 500 రూపాయలు, కేటగిరి 3 ఐస్కేల్డ్ 22,750 రూపాయలు గత ప్రభుత్వం జీవోను విడుదల చేయడం జరిగింది. కానీ దాని అమలు చేయకుండా యజమానులు గత ప్రభుత్వ మీద ఒత్తిడి తీసుకువచ్చి అమ్మలు చెయ్యకుండా నొక్కి పెట్టడం జరిగింది. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు ఉన్నది. పెద్దగా కార్మికులకు ఒరగబెట్టేది ఏమీ లేదు. రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాల అమల మీద ఆలోచన చేయాలి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు ఏ పరిశ్రమల్లో కానీ ఏ సంస్థలో పనిచేసే కార్మికులకు కనీస వేతనం బేసిక్ 26 వేల రూపాయలు అమలు చేయాలి.

కార్మికులు రాష్ట్ర ప్రభుత్వాన్ని జీతాలు పెంచిందని సంపరాల పడుతున్నారు కానీ పెంచినటువంటి వేతనాలు ఏ మూలకు కూడా సరిపోవు. రాష్ట్రంలోని ఒకసారి ఎమ్మెల్యే అయితే వారి జీతాలు ఏ విధంగా ఉన్నాయో ఆలోచించాలి. కార్మికులు ఐక్యమత్యం తోటి పోరాడితే తప్ప కనీస వేతనాలు ఈ పాలకులు అమలు చేయరు కార్మికులు, కర్షకులు అందరూ కలిసి పోరాటాలకు సిద్ధం కావాలని కోరుతున్నాను.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments