నేటి సత్యం నిజాంబాద్ ఆగస్టు 11
హాస్టల్ విద్యార్థులను చితకబాదిన వార్డెన్
జిల్లా చందూరు మండల కేంద్రంలోని బీసీ హాస్టల్‌లో విద్యార్థులపై వార్డెన్ విచక్షణ రహితంగా బాధడంతో పలువురు విద్యార్థులకు శరీరంపై వార్తలు వచ్చాయి
చందూర్ మండల కేంద్రంలోని బీసీ హాస్టల్‌లో విద్యార్థులపై వార్డెన్ దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది హాస్టల్ వార్డెన్ కల్పలత పదిమంది విద్యార్థులను కర్రతో కొట్టినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని విద్యార్థులు చెప్పినప్పటికీ వార్డెన్ వినకుండా తమపై కర్రతో ఇష్టం వచ్చినట్లు వార్డెన్ మేడం కొట్టారని విద్యార్థులు తెలిపారు ఈ ఘటనలో విద్యార్థుల శరీరాలపై దెబ్బల గుర్తులు కనిపించేలా కొట్టినట్లు సమాచారం. ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులపై దాడికి పాల్పడిన వార్డెన్‌పై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.