Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogడాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఘన నివాళి

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఘన నివాళి

నేటి సత్యం శేరిలింగంపల్లి ఏప్రిల్ 14 “సామాజిక న్యాయం కోసం పోరాటం కొనసాగుద్దాం అంబేద్కర్ చూపిన దారి మనదే!” టి రామకృష్ణ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు

135వ జయంతి సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కు ఎర్ర జెండా వందనం

శేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా టి రామకృష్ణ మాట్లాడుతూ.

దేశాన్ని సమానత్వ దిశగా నడిపించిన మహామేధావి, పీడిత ప్రజల విమోచన యోధుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా సిపిఐ పార్టీ ఘనంగా నివాళులు అర్పిస్తోంది.

అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం సామాన్య ప్రజలకు హక్కులు కల్పించేందుకు, కుల వివక్షను నిర్మూలించేందుకు ఒక శక్తివంతమైన ఆయుధం. కానీ నేటి పాలక వర్గాలు ఆ రాజ్యాంగ స్ఫూర్తిని తుంచిపారేస్తూ, కార్పొరేట్ శక్తులకు దేశాన్ని అప్పగిస్తున్నాయి. ఇది అంబేద్కర్ ఆశయాలకు వ్యతిరేకం!

సామాజిక న్యాయం, సమానత్వం, లౌకికత, ప్రజాస్వామ్యం—ఈ విలువల కోసం అంబేద్కర్ చేసిన పోరాటాన్ని మర్చిపోలేం. కానీ నేడు విద్య, ఉపాధి, భూమి హక్కులు, దళితులపై దాడులు పెరుగుతుండటం పాలకుల వైఫల్యానికి నిదర్శనం.

ప్రతి గ్రామం, ప్రతి వాడలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించాలి

రాజ్యాంగాన్ని కాపాడే పోరాటంలో ప్రజలు ఐక్యంగా నిలవాలి

కుల వివక్ష, అన్యాయానికి వ్యతిరేకంగా ఉద్యమాలు ముమ్మరం చేయాలి

పీడిత వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడాలి

అంబేద్కర్ చూపిన మార్గం – పోరాటమే పరిష్కారం!

సమాన సమాజ నిర్మాణమే నిజమైన నివాళి!

ఈ కార్యక్రమంలో శేర్లింగంపల్లి నియోజకవర్గం సిపిఐ కార్యదర్శి డిహెచ్పీఎస్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కే వెంకటస్వామి. మండల సహాయ కార్యదర్శి జెట్టి శ్రీను. ఆఫీస్ పెట్ కార్యదర్శి బి నారాయణ. మండల సహాయం కార్యదర్శి యం వెంకటేష్ దాసు కాసిం. చంటి తిరుపతయ్య. తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments